ఇది చరణ్ కి చెప్పిన కథేనట!
- 'జెర్సీ'తో హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి
- విజయ్ దేవరకొండతో నెక్స్ట్ మూవీ
- స్పై థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న సినిమా
ఇంతకుముందు చరణ్ తో గౌతమ్ తిన్ననూరి సినిమా ఉండనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ కాంబో అంతకుమించి ముందుకు వెళ్లలేకపోయింది. ఇక అదే కథను ఆయన విజయ్ దేవరకొండకి చెప్పి ఒప్పించాడట. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడవనుంది.
'గూఢచారి' సినిమా హిట్ తరువాత మళ్లీ స్పై థ్రిల్లర్ జోనర్లో సినిమాలు రావడం మొదలైంది. ఇటీవల వచ్చిన అఖిల్ 'ఏజెంట్' .. త్వరలో రానున్న నిఖిల్ 'స్పై' కూడా ఈ తరహా జోనర్లో వచ్చినవే. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా కూడా అదే జోనర్లో రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో ఇక్కడ హిట్ అందుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.