ఎన్టీఆర్‌కి జోడీగా మరో బాలీవుడ్ హీరోయిన్
- ప్రశాంత్ నీల్ తో సినిమాకు ఓకే చెప్పిన తారక్
- అందులో హీరోయిన్ గా నటించనున్న శ్రద్దా కపూర్
- ప్రస్తుతం జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాలతో తారక్ సినిమా
ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ 1, 2తో ఇండియా టాప్ డైరెక్టర్లతో ఒకరిగా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు తారక్ ఒప్పుకున్నారు. నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ తీస్తున్నారు. ఇటు సలార్, అటు కొరటాలతో తారక్ సినిమా పూర్తవగానే.. నీల్, ఎన్టీఆర్ చిత్రం పట్టాలపైకి వెళ్లనుంది. ఈ చిత్రం గురించి ఇప్పుడు ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ప్యాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. సాహోతో టాలీవుడ్ కు దగ్గరైన శ్రద్దా కపూర్. ఆమెకు కథ వినిపించినట్టు తెలుస్తోంది. ఒకవేళ శ్రద్ద హీరోయిన్ గా ఖరారైతే మరో క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించనుంది.