సోషల్ మీడియా వల్లే సమంతకు, నాకు మధ్య ఈ పరిస్థితులు!: నాగచైతన్య
- సమంత మంచి మనసు ఉన్న వ్యక్తి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న చైతూ
- చట్ట ప్రకారం విడాకులు తీసుకొని ఏడాది అవుతోందని వ్యాఖ్య
- తన గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని లాగారంటూ ఆవేదన
సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయన్నారు. తామిద్దరి మధ్య ఒకరిపై మరొకరికి గౌరవం లేనట్లుగా ప్రజల్లోకి వెళ్లిందన్నారు. అది తనను ఎంతగానో బాధపెట్టిందన్నారు. ఈ వ్యవహారంలో మరో దారుణమైన అంశం ఏమంటే తన గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగారని, దీంతో ఆ మూడో వ్యక్తిని అగౌరవపరిచినట్లు అయిందన్నారు. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు తన వ్యక్తిగత జీవితంపై పలువురు తనను ప్రశ్నిస్తుంటారని, మొదట వాటిని పట్టించుకోనప్పటికీ, పదేపదే తన పెళ్లి గురించి ఎందుకు వదంతులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.