ఏపీలో జూనియర్ కాలేజీలకు షాక్.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు
- జరిమానాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు
- కాలేజీని ఇంకోచోటుకు అనుమతి లేకుండా మార్చితే విధించే జరిమానా 5 రెట్లు పెంపు
- మహిళా కాలేజీగా అనుమతి తీసుకొని, కో ఎడ్యుకేషన్ నిర్వహిస్తే రూ.2 లక్షల ఫైన్
మండలం, మున్సిపాలిటీల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అనుమతి లేకుండా కళాశాలను మార్చితే విధించే జరిమానా రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచింది. మండలం నుంచి మండలానికి, మండలం నుంచి పురపాలక, నగరపాలక ప్రాంతానికి అనధికారికంగా మార్చితే విధించే జరిమానాను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
అనుమతులు లేకుండా ఇతర సొసైటీలు, ట్రస్టులకు మార్పు చేసినా రూ.5 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మహిళా కళాశాలగా అనుమతి తీసుకొని, కో ఎడ్యుకేషన్ నిర్వహిస్తే రూ.రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేసింది.