బన్నీ సరసన సంయుక్త.. త్రివిక్రమ్ నుంచి కబురు?
- వరుసగా నాలుగు హిట్లు ఖాతాలో వేసుకున్న మలయాళ బ్యూటీ
- పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న అల్లు అర్జున్
- ఇందులో ఒక హీరోయిన్ గా సంయుక్తను ఎంచుకున్నట్టు ప్రచారం
ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని టాలీవుడ్ సమాచారం. ‘పుష్ప 2’ బన్నీ .. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ హీరోయిన్లలో ఒకరిగా సంయుక్తకు త్రివిక్రమ్ నుంచి పిలుపు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే సంయుక్తకు టాలీవుడ్ లో ఇక తిరుగుండదని అంటున్నారు.