అత్యంత విషమంగా శరత్‌బాబు ఆరోగ్యం.. ప్రకటించిన ఏఐజీ ఆసుపత్రి
- వారం రోజుల క్రితం ఏఐజీ ఆసుపత్రిలో చేరిన శరత్ బాబు
- ఆర్యోగం విషమంగానే ఉన్నా కోలుకుంటారన్న ఆసుపత్రి
- ఆయన చనిపోయినట్టు వచ్చిన వార్తలపై తీవ్రంగా స్పందించిన కుటుంబ సభ్యులు
మార్చిలో అనారోగ్యానికి గురైన శరత్‌బాబు చెన్నైలో చికిత్స చేయించుకున్నారు. గతవారం మరోమారు అనారోగ్యం బారినపడడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు షికారు చేస్తున్నాయి. శరత్‌బాబు మృతి చెందినట్టు కొన్ని వెబ్‌సైట్లలో నిన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం కూడా తెలపడంతో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని, వాటిని నమ్మవద్దని శరత్ బాబు సోదరి కోరారు. ఆయన కోలుకుని తర్వలోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.