శరత్ బాబు కోలుకుంటున్నారు, అలాంటి వార్తలు నమ్మకండి: కుటుంబ సభ్యులు
- శరత్ బాబు చనిపోయాడంటూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలు
- షాక్‌కు గురైన ఫ్యామిలీ, ఆయన కోలుకుంటున్నారని వివరణ
- త్వరలో పూర్తిగా కోలుకొని, మీడియా ముందుకు వస్తారని ఆశాభావం
శరత్ బాబు పీఆర్ కూడా హెల్త్ కండిషన్ పై స్పందించారు. శరత్ బాబుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన పూర్తిగా కోలుకొని అందరి ముందుకు వస్తారని చెప్పారు. గతవారం శరత్ బాబు అనారోగ్యం కారణంగా హైదరాబాదులో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గత మార్చిలోను అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు చెన్నైలో చికిత్స చేయించారు.