మైదానంలో గొడవ.. కోహ్లీ, గంభీర్ పై ఐపీఎల్ కఠిన చర్య!
- ఇద్దరికీ నూరు శాతం మ్యాచ్ ఫీజులో కోత
- నవీనుల్ హక్ కు మ్యాచు ఫీజులో 50 శాతం జరిమానా
- ప్రకటన విడుదల చేసిన ఐపీఎల్
దీంతో గంభీర్, కోహ్లీలకు నూరు శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు. అలాగే, నవీనుల్ హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. వీరు ముగ్గురూ తాము చేసిన నేరాలను అంగీకరించడమే కాకుండా, చర్యలకు కట్టుబడి ఉంటామని తెలిపినట్టు ఐపీఎల్ నుంచి ప్రకటన వెలువడింది. నిన్నటి మ్యాచ్ లో లక్నో తమ ముందున్న లక్ష్యాన్ని ఛేదించే విషయంలో అపసోపాలు పడింది. వికెట్ పడిన ప్రతిసారీ కోహ్లీ అంతులేని సంబరాలతో సందడి చేయడాన్ని ప్రేక్షకులు గమనించారు. ముఖ్యంగా కోహ్లీ, గంభీర్ మధ్య నెలకొన్న వ్యక్తిగత వైరం క్రీడా వాతావరణాన్ని చెడగొడుతోంది. అంతకుముందు బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుపై లక్నో జట్టు గెలిచిన సందర్భంలో గంభీర్ చేసిన హావభావాలకు ప్రతీకారంగా అన్నట్టు.. నిన్నటి మ్యాచులో కోహ్లీ రెచ్చిపోవడం కనిపించింది.