అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హేళన చేసిన ట్రంప్.. వీడియో వైరల్!
- బైడెన్‌ను అనుకరిస్తూ ట్రంప్ హేళన
- ప్రసంగం మర్చిపోయినట్టు, ఎటువెళ్లాలో తెలీక తికమక పడ్డట్టు నటించిన ట్రంప్
- నెట్టింట వీడియో వైరల్
రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రెండు రోజులకే ట్రంప్ ఆయనను హేళన చేసేలా అనుకరించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్‌ను పలు న్యాయపరమైన సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఆయన రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించదలిచారు. ఈ మారు బైడెన్‌పై ట్రంప్ పూర్తి ఆధిక్యత కనబరుస్తారని ఆయన అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ట్రంప్ సభకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.