దస్తగిరి మొదటి వాంగ్మూలంలో లేని అవినాశ్, భాస్కర రెడ్డి పేర్లు ఆ తర్వాత వాంగ్మూలంలో ఎందుకు వచ్చాయి?: కోర్టులో అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు
- వివేకా హత్య కేసులో దస్తగిరే హంతకుడన్న అవినాశ్ న్యాయవాది
- అతని వాంగ్మూలం పరిగణలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్న
- అరెస్ట్ అయినప్పుడు అవినాశ్, భాస్కర రెడ్డి పేర్లు చెప్పలేదని వాదనలు
- రెండో వాంగ్మూలంలో వీరు పేర్లు ఎలా వచ్చాయన్న అవినాశ్ న్యాయవాది
దస్తగిరి మొదటి వాంగ్మూలంలో లేని అవినాశ్, భాస్కర రెడ్డి పేర్లు ఆ తర్వాత వాంగ్మూలంలో ఎందుకు వచ్చాయన్నారు. ఆ తర్వాత దస్తగిరి ముందస్తు బెయిల్ దాఖలు చేసుకుంటే సీబీఐ వ్యతిరేకించలేదని అవినాశ్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. యాంటిసిపేటరీ బెయిల్ ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయ సమ్మతం కాదన్నారు. హియర్ అండ్ సే ఎవిడెన్స్ ను బట్టే ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ ఇది ఎప్పుడూ ఎవిడెన్స్ కాదన్నారు. అవినాశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సీబీఐ దర్యాఫ్తు చేస్తోందన్నారు. గూగుల్ టేకౌట్ ఎలా ఆధారమవుతుందన్నారు.
అవినాశ్ రెడ్డి జమ్మలమడుగు ప్రచారానికి వెళ్తుండగా వివేకా చనిపోయాడని ఆయన అల్లుడి తమ్ముడు సమాచారం ఇచ్చారన్నారు. అవినాశ్ తరఫు లాయర్లు ప్రధానంగా పై నాలుగు వాదనలు వినిపించారు. కాగా, వైఎస్ సునీత తరఫున లాయర్ లూథ్రా వాదనలు వినిపించాల్సి ఉంది.