పుష్ప2 సెట్స్ లోకి తారక్.. కారణం ఏంటో?
- హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ లో శరవేగంగా షూటింగ్
- బుధవారం సెట్స్ లో కనిపించిన తారక్
- ప్రస్తుతం కొరటాలతో తన 30వ సినిమా చేస్తున్న ఎన్టీఆర్
కాగా, ఈ సెట్ లో తారక్ ప్రత్యక్షం అయ్యారు. బుధవారం జూనియర్ ఎన్టీఆర్ సెట్ లోకి వచ్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. ఫార్మల్ డ్రెస్ లో వున్న ఎన్టీఆర్ లోపలికి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది. కాస్త గ్యాప్ లభించడంతో తారక్ .. పుష్ప సెట్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే తన స్నేహితుడైన బన్నీని కలిసి సర్ ప్రైజ్ ఇవ్వడానికే తారక్ వచ్చారా? లేక పుష్ప సినిమాలో ఆయన ఏదైనా గెస్ట్ రోల్ చేస్తున్నారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే చర్చ మొదలైంది.