ఏపీలో సమంతకు గుడి.. ఎక్కడంటే..!
- బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని
- తన ఇంటి ఆవరణలో గుడి కట్టిస్తున్న వైనం
- ఈ నెల 28న ప్రారంభమవుతున్న గుడి
ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తుండటంలో ఆమె చూపిస్తున్న చొరవకు ఆయన అభిమానం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆమెకు గుడి కట్టించాలని సంకల్పించాడు. తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టిస్తున్నాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సమంతను తాను నేరుగా చూడలేదని... కానీ, ఆమెపై అభిమానంతో గుడి కట్టిస్తున్నానని చెప్పాడు. ఈ నెల 28న గుడిని ప్రారంభిస్తున్నానని తెలిపాడు.