ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సర్ ప్రైజ్ లోడింగ్!
- హరీశ్ శంకర్ తో ఉస్తాద్ సినిమా చేస్తున్న పవన్ కల్యాణ్
- ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్
- మే11తో ఆ సినిమాకు 11 ఏళ్లు
- ఆ రోజు ఉస్తాద్ నుంచి స్పెషల్ గ్లింప్స్ వస్తుందని ప్రచారం
మే 11తో గబ్బర్ సింగ్ విడుదలై 11 సంవత్సరాలు కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయాలని చిత్ర బృందం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అదే జరిగితే పవన్ ఫ్యాన్స్ కు పండగే కానుంది. హరహర వీరమల్లు, ఉస్తాద్ తో పాటు పవన్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. తన మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి వినోదయ్ సిత్తం రీమేక్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరగుతోంది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది.