హుస్సేన్ సాగర్ లో తప్పిన పెనుముప్పు.. వీడియో ఇదిగో!
- ఈదురు గాలులకు అదుపుతప్పిన భాగమతి బోటు
- భయాందోళనలకు గురైన 30 మంది పర్యాటకులు
- స్పీడ్ బోట్ల సాయంతో బోటును ఒడ్డుకు చేర్చిన సిబ్బంది
ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా హుస్సేన్ సాగర్ లో భాగమతి బోటు అదుపు తప్పింది. గాలి వేగానికి దూరంగా వెళ్లిపోయింది. ఆ సమయంలో బోటులో సుమారు 30 మంది పర్యాటకులు ఉన్నారు. బోటు అదుపు తప్పడంతో వారంతా భయాందోళనలకు గురయ్యారు. భాగమతి బోటు దూరంగా వెళ్లడం గమనించిన పర్యాటక సిబ్బంది ప్రమాదాన్ని శంకించి స్పీడ్ బోట్లతో రంగంలోకి దిగారు. పర్యాటకులతో సహా బోటును తాళ్ల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాక పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.