'ఏజెంట్' నుంచి ఊర్వశి రౌతేలా ఐటమ్ నెంబర్ రిలీజ్!
- 'ఏజెంట్' గా కనిపించనున్న అఖిల్
- ప్రత్యేకమైన పాటలో మెరిసిన ఊర్వశి రౌతేలా
- ఆకట్టుకుంటున్న భీమ్స్ బీట్
- ఈ నెల 28వ తేదీన సినిమా రిలీజ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'వైల్డ్ సాలా' అంటూ సాగే ఐటమ్ నెంబర్ ను వదిలారు. ఊర్వశి రౌతేల .. అఖిల్ పై ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించారు. ఊర్వశి కాస్ట్యూమ్స్ .. ఆమె హాట్ లుక్స్ .. స్టెప్స్ ఈ పాటకి హైలైట్ గా నిలుస్తున్నాయి. ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాకి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించాడు. అయితే ఈ ఐటమ్ నెంబర్ ను మాత్రం భీమ్స్ కంపోజ్ చేశాడు. యూత్ ను హుషారెత్తించేలానే ఈ బీట్ ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. మమ్ముట్టి .. సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.