వివేకా హత్య కేసు: కడప మాజీ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నుంచి వివరాలు తీసుకున్న సీబీఐ
- వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
- ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మను రెండు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ
- గతంలో వివేకా హత్య కేసులో సిట్ వేసిన ఏపీ సర్కారు
- సిట్ లో సభ్యుడిగా ఉన్న రాహుల్ దేవ్ శర్మ
రాహుల్ దేవ్ శర్మ నుంచి సీబీఐ అధికారులు ఇవాళ కీలక సమాచారం సేకరించారు. వివేకా కేసుకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని రాహుల్ దేవ్ శర్మ సీబీఐకి సమర్పించారు. వివేకా ఇంట్లో లభించిన ఆధారాలపై సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో దాదాపు 2 గంటలపాటు ఈ విచారణ జరిగింది.