అనధికారిక సైరన్లు వినియోగించే వాహనాలు సీజ్ చేస్తాం: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
- అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశం
- సైరన్ లు వాడుతూ తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగించడంపై ఫిర్యాదుల స్పందన
- ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులకు సీపీ సూచన
‘ఇలా చట్టవిరుద్ధంగా సైరన్‌లను ఉపయోగించడం వల్ల చాలా ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ నిర్వహణకు అంతరాయం కలుగుతోంది. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనధికార సైరన్లు వాడే అన్ని వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను కోరాను. అంతేకాదు, రోగులు లేకపోయినా, నకిలీ రోగులను తీసుకెళ్తున్న అంబులెన్సులు కూడా అనవసరంగా సైరన్‌లు వినియోగిస్తున్నట్లు సమాచారం అందితే తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇలా చట్టవిరుద్ధమైన సైరన్‌లను ఉపయోగించే వాహనాలకు సంబంధించిన రుజువులతో తమకు సమాచారం ఇస్తుండాలని ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నానని సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.