ఈ రోజు అవినాశ్ రెడ్డిని 8 గంటల పాటు విచారించిన సీబీఐ
- రెండో రోజు విచారణకు హాజరైన కడప ఎంపీ
- వైఎస్ భాస్కరరెడ్డిని కూడా విచారించిన సీబీఐ
అయితే ఆ లోపు అంటే 25వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని కోర్టు సీబీఐని ఆదేశించింది. అదే సమయంలో అవినాశ్ రెడ్డి ఆ రోజు వరకు ప్రతిరోజు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి నేడు వరుసగా రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ముందస్తు బెయిల్ పైన 25వ తేదీన తుది తీర్పు వెలువరించనుంది.