సీఎం జగన్, అవినాశ్ రెడ్డిల నుంచి నాకు ప్రాణహాని ఉంది: దస్తగిరి
- తనను, తన కుటుంబాన్ని ఏమైనా చేస్తారనే భయం ఉందన్న దస్తగిరి
- తగిన రక్షణ కల్పించాలని కడప ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు
- సునీత నుంచి డబ్బులు తీసుకున్నానని అవినాశ్ ఆరోపిస్తున్నారని మండిపాటు
వివేకా కూతురు సునీత నుంచి తాను డబ్బులు తీసుకున్నట్టు అవినాశ్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారని అన్నారు. తాను అమ్ముడుపోయానని నిరూపిస్తే జైలు శిక్షకు సిద్ధమని, నిరూపించకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్తారా? అని ప్రశ్నించారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని సీబీఐ ఎస్పీ, రాయలసీమ రేంజ్ డీఐజీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా వినతులు అందజేస్తానని చెప్పారు.