ఏకంగా10 భాషల్లో సూర్య కొత్త చిత్రం
- శివ దర్శకత్వంలో పీరియాడిక్ సినిమా చేస్తున్న సూర్య
- చిత్రానికి ‘కంగువ’ టైటిల్ ఖరారు
- హీరోయిన్ గా నటిస్తున్న దిశా పఠానీ
పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను చిత్ర బృందం ఖరారు చేసింది. దీనికి ‘కంగువ’ అనే పేరు పెట్టింది. కంగువ అంటే అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. సినిమా షూటింగ్ గోవా, చెన్నై, ఇతర ప్రాంతాల్లో జరుగుతోంది. వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2024లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.