జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురైన సమంత
- విడుదలకు ముస్తాబవుతున్న శాకుంతలం
- వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలతో సమంత బిజీ
- జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నానని వెల్లడి
ఇవాళ ఎంఎల్ఆర్ఐటీలో జరగాల్సిన శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనడంలేదని తెలిపారు. వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనడం వల్ల అనారోగ్యానికి గురయ్యానని వివరించారు. శాకుంతలం టీమ్ తో కలిసి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరినీ మిస్సవుతున్నానని సమంత విచారం వ్యక్తం చేశారు.