ప్రభుకు నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది: ఖుష్బూ
- ప్రభు, ఖుష్బూ కాంబినేషన్లో 32 ఏళ్ల క్రితం వచ్చిన 'చిన్నతంబి'
- తెలుగులో 'చంటి' పేరుతో రీమేక్
- తన పాత్ర అందరి హృదయాల్లో నిలిచిపోయిందన్న ఖుష్బూ
ఈ సినిమా విడుదలై అప్పుడే 32 ఏళ్లు అవుతోందంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కె.బాలుకి, అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఇళయరాజాకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెపుతున్నానని అన్నారు. ఈ చిత్రంలోని తన పాత్ర అందరి హృదయాల్లో నిలిచిపోయిందని చెప్పారు. ఈ చిత్రం 1991లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. వెంకటేశ్, మీనా కాంబినేషన్లో ఈ సినిమాను 'చంటి' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.