నా ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి: కిరణ్ కుమార్ రెడ్డి
- తాను ప్రజాజీవితంలోకి రావడానికి బీజేపీ మాత్రమే ఉందన్న కిరణ్
- రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని చెప్పినా వినలేదన్న మాజీ సీఎం
- బీజేపీ హైకమాండ్ ఏ బాధ్యతను అప్పగించినా స్వీకరిస్తానని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని మీడియా ప్రతినిధులు అడగగా... కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని అన్నారు. బీజేపీ గురించే మాట్లాడుకుందామని చెప్పారు. రాష్ట్ర విభజన చేయడం వల్ల కాంగ్రెస్ భారీగా నష్టపోతుందని కాంగ్రెస్ హైకమాండ్ కు ఆనాడు చెప్పినా వారు వినలేదని... అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని చెప్పారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు తన హయాంలో లేవని అన్నారు.
బీజేపీ హైకమాండ్ తనకు ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతలను స్వీకరిస్తానని చెప్పారు. తాను పదవిని ఆశించి బీజేపీలో చేరలేదని అన్నారు. పార్టీ బలోపేతం కోసం తాను పని చేస్తానని చెప్పారు. ఇకపై రెగ్యులర్ గా ఏపీకి వస్తానని అన్నారు. ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు.