సీఎం జగన్ టూర్ లో ప్రొటోకాల్ రగడ.. అలిగి వెళ్లిపోయిన బాలినేని!
- హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రిని ఆపిన పోలీసులు
- వాహనం వదిలి కాలినడకన రావాలని సూచన
- పోలీసుల తీరుపై మండిపడ్డ బాలినేని
- సీఎం సభకు హాజరవకుండా వెళ్లిపోయిన నేత
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఈబీసీ నిధులను విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా నేతలు, అధికారులు మార్కాపురం చేరుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా తన అనుచరులతో కలిసి మార్కాపురం వచ్చారు. సీఎంను రిసీవ్ చేసుకోవడానికి హెలిప్యాడ్ దగ్గరికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనకు ప్రొటోకాల్ లో ప్రాధాన్యత ఇవ్వలేదు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని.. సీఎం పర్యటనకు హాజరుకాకుండా ఒంగోలు వెళ్లిపోయారు.