అదరగొడుతున్న నాగ చైతన్య ‘కస్టడీ’ ఫస్ట్ సింగిల్
- హెడ్ అప్ హై అంటూ సాగే పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్
- పోలీసుల గొప్పతనాన్ని వర్ణించేలా రాసిన రామజోగయ్య శాస్త్రి
- మే 12న విడుదల కాబోతున్న సినిమా
పోలీసుల గొప్పతనాన్ని వర్ణించేలా రామజోగయ్య శాస్త్రి రాసిన పాటను యువన్ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కోలర్ పాడారు. ‘సేఫ్టీ, సెక్యూరిటీకి సింబల్ ఈ ఖాకీరా.. లాఠీతో జర్నీ చేసే లైఫ్ ఎంతో లక్కీరా’ అంటూ ఫాస్ట్ బీట్ తో సాగే పాటకు చైతన్య హుషారైన స్టెప్పులతో అలరించాడు. పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో నాగచైతన్యపై చిత్రీకరించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ చిత్రం మే 12న సినిమా విడుదల కానుంది.