అపర కాళికలా అల్లు అర్జున్... పుష్ప-2లో బన్నీ లుక్ బీభత్సం
- పుష్ప-2 ద రూల్ హవా మొదలైందన్న బన్నీ
- తన లుక్ ను సోషల్ మీడియాలో పంచుకున్న ఐకాన్ స్టార్
- రౌద్రం ఉట్టిపడేలా అల్లు అర్జున్ లుక్
మెడలో నిమ్మకాయల దండ, మెడలో హారాలు, చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, జాకెట్, చీరకట్టి అపర కాళిలా రౌద్రం ఉట్టిపడేలా ఉన్నాడు. ఒకచేతిలో తుపాకీ పుష్ప క్యారెక్టర్ ను చాటుతోంది. అటు, పుష్ప-2 ద రూల్ గ్లింప్స్ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కేవలం 4 గంటల వ్యవధిలో 4.12 లక్షల మంది వీక్షించారు.