కాంగ్రెస్ ను వీడుతానని ఎప్పుడూ అనుకోలేదు.. మోదీ గురించి నాకు బాగా తెలుసు: కిరణ్ కుమార్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో భాధపడుతోందన్న కిరణ్
- దేశాభివృద్ధికి సంబంధించి బీజేపీకి క్లియర్ విజన్ ఉందని వ్యాఖ్య
- తనకు ఏ బాధ్యతలను అప్పగించినా నిర్వర్తిస్తానన్న మాజీ సీఎం
1980లలో తొలి ఎన్నికల్లో బీజేపీకి రెండు సీట్లు వచ్చాయని, ఒకటి ఏపీలో, మరొకటి గుజరాత్ లో వచ్చాయని కిరణ్ చెప్పారు. ఆ రెండు సీట్ల నుంచి 303 స్థానాలకు బీజేపీ ఎదిగిందని తెలిపారు. ఎంతో కష్టపడి బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. దేశ అభివృద్ధికి సంబంధించి బీజేపీకి క్లియర్ విజన్ ఉందని కితాబునిచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడు మోదీ కూడా సీఎంగా ఉన్నారని... తాము అప్పుడు కొన్ని సమావేశాల్లో కలుసుకున్నామని, ఆయన గురించి తనకు బాగా తెలుసని, అవినీతికి మోదీ పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీకి ప్రజలు దగ్గరయ్యారని చెప్పారు. బీజేపీ హైకమాండ్ తనకు ఏ బాధ్యతలను అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.