'హను మాన్' నుంచి 'హనుమాన్ చాలీసా' రిలీజ్!
- ప్రశాంత్ వర్మ నుంచి 'హను మాన్'
- సూపర్ హీరోగా కనిపించనున్న తేజ సజ్జ
- కథానాయికగా అమృత అయ్యర్
- కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
- త్వరలోనే వివిధ భాషల్లో విడుదల
ఈ రోజున హనుమజ్జయంతి .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి 'హనుమాన్ చాలీసా'ను రిలీజ్ చేశారు. హనుమాన్ చాలీసాపై, హనుమాన్ కి సంబంధించిన యానిమేషన్ విజువల్స్ ను కట్ చేశారు. యానిమేషన్ తో కూడిన ఈ హనుమాన్ చాలీసా ఆకట్టుకునేలా ఉంది.
తేజ సజ్జ జోడీగా అమృత అయ్యర్ నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో వినయ్ రాయ్ .. వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. అనుదీప్ దేవ్ - హరి గౌర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.