మొబైల్ ఫోన్ తో పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్న పోలీస్ కమిషనర్ ను ఆపేసిన మహిళా కానిస్టేబుల్
- తెలంగాణలో కలకలం రేపుతున్న పేపర్ లీకేజీ వ్యవహారం
- ఎల్బీ నగర్ లో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లిన సీపీ చౌహాన్
- మొబైల్ ఫోన్ చేతిలో ఉండటంతో ఆపేసిన మహిళా కానిస్టేబుల్
దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. ఉన్నతాధికారిని ఆపడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. అయితే, తన విధుల్లో భాగంగానే ఆమె అలా చేసిందంటూ సీపీ చౌహాన్ ఆమెను అభినందించారు. ఆమెకు మొబైల్ ఫోన్ ఇచ్చి పరీక్షా కేంద్రంలోకి తనిఖీకి వెళ్లారు. అంతేకాదు, డ్యూటీని సిన్సియర్ గా నిర్వహించిన ఆమెను అభినందించారు. ఆమెకు రివార్డును అందజేశారు.