రాజకీయాల్లోకి రమ్మంటున్నారు కానీ.. వాటిని తట్టుకోవడం నా వల్లకాకపోవచ్చు: దిల్ రాజు
- అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి రావాల్సి ఉంటుందన్న దిల్ రాజు
- ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని స్పష్టీకరణ
- స్వగ్రామంలోని తన ఆలయానికి రేవంత్‌ను ఆహ్వానించినప్పటి నుంచి పుకార్లు
దిల్‌రాజు రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన తన స్వగ్రామమైన నిజామాబాద్‌లోని నర్సింగ్‌పల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించి, నిర్వహిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల ‘హాత్ సే హాత్ జోడోయాత్ర’లో భాగంగా నిజమాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు తాను నిర్మించిన ఆలయానికి రేవంత్‌ను ఆహ్వానించారు. అక్కడాయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అది మొదలు దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.