ఎండలు మండిపోతున్నా.. పిల్లలకు ఒంటిపూట బడులు ఎందుకు పెట్టడం లేదు?: జగన్ కు అనగాని లేఖ
- ఉపాధ్యాయులను సాధించడానికి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న అనగాని
- ఒంటిపూట బడులు అడిగిన ఉపాధ్యాయులపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య
- రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపాటు
తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని అనగాని విమర్శించారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తుపాను కారణంగా పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధిని ఏర్పాటు చేస్తామన్న మీ హామీ ఏమయిందని ప్రశ్నించారు. 175కి 175 సీట్లు గెలుస్తామని చెప్పుకోవడం మానేసి... కనీసం 175 మంది రైతులనైనా ఆదుకోవాలని ఎద్దేవా చేశారు.