కూతురు వామిక గురించి తొలిసారి మాట్లాడిన కోహ్లీ
- తన ఫోన్ నిండా ఆమె ఫొటోలే ఉన్నాయన్న క్రికెట్ స్టార్
- వామిక మీడియా కంటపడకుండా జాగ్రత్త పడుతున్న కోహ్లీ, అనుష్క
- ఐపీఎల్16వ సీజన్ కు సిద్ధమైన ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్
‘ఆర్సీబీ బోల్డ్ డైరీస్’తో చాట్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఈ విషయం వెల్లడించాడు. తన ఫోన్ గ్యాలరీ మొత్తం వామిక చిత్రాలే ఉన్నాయన్నాడు. ‘వామిక ఫొటోలు చాలా తీశాను. వామిక, అనుష్కతో పాటు మా ఇంట్లోని పెట్ (కుక్క) ఫొటోలు కూడా తీశాను’ అని కోహ్లీ తెలిపాడు. చాన్నాళ్లు ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒక్కటైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు 2021 లో వామిక జన్మించింది.