ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుంటాను: కిరణ్ అబ్బవరం
- కిరణ్ అబ్బవరం నుంచి 'మీటర్'
- ఏప్రిల్ 7వ తేదీన విడుదల
- ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
- తన కెరియర్లో పెద్ద సినిమా అని చెప్పిన కిరణ్
ఈ వేదికపై కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. "నిన్ననే నేను ఈ సినిమాను చూశాను .. ఇంత పెద్ద సినిమాను చేశానా? అనిపించింది. ఈ సినిమాపై మీరు అంచనాలు పెంచుకోవచ్చు .. ఆ అంచనాలను అందుకునేలానే ఈ సినిమా ఉంటుంది. జాబ్ మానేసి ఇండస్ట్రీకి వచ్చాను. నిన్నటితో ఐదేళ్లు పూర్తయింది. ఈ ఐదేళ్లలో 6 షార్టు ఫిల్మ్ లు .. పెద్ద బ్యానర్లలో 7 సినిమాలు చేశాను" అన్నాడు.
"అసలు నిద్రపోతున్నావా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఇక ఇక్కడ కాస్త గ్యాప్ తీసుకుంటాను. ఇప్పటివరకూ సంపాదించిన అనుభవంతో మరిన్ని మంచి ప్రాజెక్టులను సెట్ చేసుకుంటాను. 'మీటర్' విషయానికి వస్తే, నేను ఇంతవరకూ చేసినవాటిలో ఇది పెద్ద సినిమా. ట్రైలర్ లో ఏదైతే స్పీడ్ కనిపించిందో .. సినిమా మొత్తం కూడా అదే స్పీడ్ కనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.