మహేశ్ బాబు-త్రివిక్రమ్ చిత్రం రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్ తో కొత్త చిత్రం
- వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్
- 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
- శ్రీరామనవమి సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలు
కాగా, శ్రీరామనవమి (మార్చి 30) సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ఎస్ఎంబీ28 చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.