'ఖుషీ' రిలీజ్ డేట్ ఖరారు!
- శివ నిర్వాణ నుంచి మరో ప్రేమకథ
- విజయ్ దేవరకొండ జోడీగా సమంత
- ఈ మధ్య కాలంలో ఆమె చేసిన గ్లామరస్ రోల్ ఇదే
- సెప్టెంబర్ 1వ తేదీన సినిమా రిలీజ్
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ - సమంత ఇద్దరూ కూడా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు.
శివ నిర్వాణకి పేమకథల స్పెషలిస్టుగా మంచి పేరు ఉంది. 'నిన్నుకోరి' .. 'మజిలీ' సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఆ తరువాత 'టక్ జగదీశ్'తో వేరే జోనర్ లోకి వెళ్లిన ఆయనకి నిరాశే ఎదురైంది. దాంతో మళ్లీ ఈ సారి ప్రేమకథనే సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి మరి.