ఎన్టీఆర్ 30వ సినిమా కోసం భారీ సెట్స్ .. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అంటే..!
- కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా
- ఈ నెల 23న జరగనున్న పూజ కార్యక్రమాలు
- ఈ నెల 30 నుంచి రెగ్యులర్ షూటింగు మొదలు
ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. కానీ ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కాస్త ఫ్రీ అయ్యాడు. అందువలన ఈ నెల 23వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సమాచారం. రెగ్యులర్ షూటింగును ఈ నెల 30 నుంచి మొదలుపెడతారట.
ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ సెట్స్ ను వేయించారని అంటున్నారు. రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ చిత్రీకరణతో ఫస్టు షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు. ఎన్టీఆర్ తో తలపడే విలన్ పాత్రలో 'సైఫ్ అలీ ఖాన్' కనిపించనున్నాడని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను 9 భాషల్లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.