విజయ్ దేవరకొండ గురించి సమాధానం చెప్పలేక చచ్చిపోయేదాన్నంటున్న యువ నటి
- ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన మాళవిక నాయర్
- ఆ చిత్రం తర్వాత హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిన నటి
- ఈ నెల17న విడుదలవుతున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
అప్పటికే పలు సినిమాలు చేసినా.. ఆ సమయంలో కాలేజీలో తన స్నేహితులంతా విజయ్ దేవరకొండ గురించే అడిగేవారని మాళవిక చెప్పింది. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోయేదాన్ని అని వెల్లడించింది. ఎవడే సుబ్రమణ్యం తర్వాత కళ్యాణ వైభోగమే, టాక్సీవాలా చిత్రాల్లో తన నటనతో మాళవిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు నాగశౌర్య సరసన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.