బోనులో ఉన్నా పులి పులే.. నేను వెనకడుగు వేయను: గాలి జనార్దన్ రెడ్డి
- గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం
- రెడ్డి వస్తారనే నమ్మకం తనకు ఉందనన్న సీఎం బొమ్మై
- ఇతరులకు షాక్ ఇస్తానన్న జనార్దన్ రెడ్డి
తాను వెనకడుగు వేయనని... పులి బోనులో ఉన్నా పులే అని ఆయన అన్నారు. ఇతరులకు షాక్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విదేశాల్లో తనకు డబ్బు ఉందని చెపుతున్నారని... ఆ సొమ్మును కనిపెట్టేందుకు ఏజెన్సీలకు ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. విదేశాల్లో ఉందని చెపుతున్న డబ్బును తెస్తే... దాన్ని ప్రజలకే పంచి పెడతానని చెప్పారు. తాను స్థాపించిన పార్టీలోకి ఇతర నేతలు చేరకుండా చేసేందుకే తాను బీజేపీలోకి వస్తున్నాననే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పార్టీతో తాను ముందుకు వెళ్లకుండా లొంగదీసుకోవచ్చని ఎవరైనా భావిస్తే అది పొరపాటే అవుతుందని అన్నారు.