కృష్ణవంశీగారిని చూడగానే ఇదే మాట అనుకున్నాను: నటి ప్రగతి
- హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చిన ప్రగతి
- అమ్మ పాత్రలలో పాప్యులర్
- కృష్ణవంశీ గురించిన ప్రస్తావన
- ఆయన ప్రత్యేకతను వెల్లడించిన ప్రగతి
'అంతఃపురం ' .. 'మురారి' సినిమాలు చూసిన తరువాత, కృష్ణవంశీగారి సినిమాలో చేయాలనిపించింది. కానీ ఆయన సినిమాలో అవకాశం రావడమే చాలా కష్టమైన విషయం అనుకున్నాను. అలాంటి నాకు 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సమయంలో ఆయనను చూశాను" అన్నారు.
"కృష్ణవంశీ గారి సింప్లిసిటీ చూసి నేను ఆశ్చర్యపోయాను. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అనే సామెత గుర్తొచ్చింది. ఒక ఫ్యామిలీ నెట్ వర్క్ ను తెరపై అద్భుతంగా చూపించడం ఆయన ప్రత్యేకత. అందువల్లనే ఆయన సినిమాల్లోని చిన్న చిన్న పాత్రలు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి" అని చెప్పుకొచ్చారు.