రామ్ చరణ్ బర్త్ డేకు దిల్ రాజు ఇచ్చే కానుక ఇదేనా!
- శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న చరణ్
- ఈ నెల 27న చరణ్ బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలకు సన్నాహాలు
- చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వాని
ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. ఓ పాత్రలో రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో ఎలక్షన్ అధికారిగా కనిపిస్తాడని తెలుస్తోంది. దాంతో, అధికారి, సర్కారోడు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా సీఈవో టైటిల్ తెరపైకొచ్చింది.చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్ అనే అర్థంలో ఈ టైటిల్‌ను పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అన్ని భాషలకు ఈ టైటిల్ సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో బర్త్ డే గిఫ్ట్ గా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని, విడుదల తేదీని వెల్లడించాలని చిత్ర బృందం భావిస్తోంది. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని నిర్మాత దిల్ రాజ్ ఓ కార్యక్రమంలో చెప్పారు. దాంతో, టైటిల్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.