సానియా వీడ్కోలు కార్యక్రమంలో కనిపించని షోయబ్.. పొరపొచ్చాలు నిజమేనంటున్న నెటిజన్లు!
- ఈ నెల 5న ఎల్బీ స్టేడియంలో సానియా వీడ్కోలు కార్యక్రమం
- అదే రోజు రాత్రి విందు ఇచ్చిన టెన్నిస్ స్టార్
- ఈ రెండు కార్యక్రమాలకు హాజరు కాని షోయబ్
సానియా మీర్జా వీడ్కోలు మ్యాచ్‌కు, విందుకు భర్త షోయబ్ మాలిక్ హాజరు కాకపోవడమే ఈ ఊహాగానాలు మళ్లీ తెరపైకి రావడానికి కారణం. ఈ నెల 5న ఎల్బీ స్టేడియంలో సానియా వీడ్కోలు కార్యక్రమం జరగ్గా, అదే రోజు రాత్రి సానియా విందు ఏర్పాటు చేసింది. ఈ రెండు కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే షోయబ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో వారిద్దరి మధ్య ఎడం పెరిగిందన్న వార్తలు నిజమేనన్న చర్చ మళ్లీ మొదలైంది.