తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ ఆర్ ఆర్' రీ రిలీజ్!
- దేశభక్తి చిత్రంగా వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్'
- ప్రపంచవ్యాప్తంగా దక్కిన భారీ వసూళ్లు
- 'ఆస్కార్' వరకూ వెళ్లిన సినిమా
- ఈ నెల 10వ తేదీన రీ రిలీజ్
ఈ సినిమాకి దక్కిన గౌరవం గురించే అంతా చర్చించుకుంటున్న ఈ సమయంలో, ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ నెల 10వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.
అల్లూరి - కొమరమ్ భీమ్ ల ఆశయాన్ని .. దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. కథాకథనాల పరంగా .. చిత్రీకరణ పరంగా .. పాటల పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా .. కెమెరా పనితనం పరంగా ఈ సినిమా ఒక అద్భుతమైన దృశ్యరూపంగా నిలిచింది. అలాంటి ఈ సినిమా, రీ రిలీజ్ వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి.