ఆసక్తిని రేపుతున్న 'భోలా' .. ట్రైలర్ రిలీజ్!
- అజయ్ దేవగణ్ దర్శకత్వంలో రూపొందిన 'భోలా'
- కార్తి 'ఖైది' సినిమాకి ఇది రీమేక్
- ముఖ్య పాత్రలలో టబు - అమలా పాల్
- ఈ నెల 30వ తేదీన సినిమా రిలీజ్
భూషణ్ కుమార్ - కృష్ణకుమార్ నిర్మించిన ఈ సినిమాకి, అజయ్ దేవగణ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
ఆ మధ్య తమిళంలో కార్తి చేసిన 'ఖైది' సినిమాకి ఇది రీమేక్. తెలుగులో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఉత్తరాదివారి అభిరుచికి తగినట్టుగా ఈ కథకి అదనపు హంగులు చేర్చారు. అజయ్ దేవగణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబూ .. అమలా పాల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.