వరుణ్ తేజ్ సరసన మిస్ వరల్డ్
- ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ పాన్ ఇండియా సినిమా
- పైలట్ పాత్రలో నటిస్తున్న మెగా హీరో
- హీరోయిన్ గా మానుషి చిల్లార్ ఎంపిక
పాన్ ఇండియా చిత్రం కావడంతో ఆ స్థాయిలోనే తారాగణం ఉండేలా చూస్తున్నారు నిర్మాతలు. వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ను ఎంపిక చేశారు. అక్షయ్ కుమార్ ‘సామ్రాజ్ పృథ్వీరాజ్’ చిత్రంతో మానుషి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కాగా, వాస్తవ సంఘటన ఆధారంగా వాయుసేనలో ఎదురయ్యే సవాళ్లను చూపించబోయే యాక్షన్ సినిమాలో వరుణ్ తేజ్ ఫైలట్‌గా కనిపిస్తాడు. హీరోయిన్ మానుషి రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించనుంది. ఆమె పాత్రను తెలియజేస్తూ చిత్ర బృందం చిన్న టీజర్ ను కూడా విడుదల చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది.