ఎన్టీఆర్ కోసం అవార్డును భారత్ కు పంపిస్తున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్
- ఆర్ఆర్ఆర్ కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు
- స్వీకరించిన రాజమౌళి, రామ్ చరణ్
- అమెరికా వెళ్లలేకపోయిన ఎన్టీఆర్
ఇటీవల ఆర్ఆర్ఆర్ కు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు లభించగా, దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ హాజరయ్యారు.
అయితే, వివిధ కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్, ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అలియా భట్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్, అలియా భట్ లకు వచ్చేవారం అమెరికా నుంచి అవార్డులను పంపించాలని నిర్ణయించినట్టు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వెల్లడించింది.
ఈ మేరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సందేశం అందించింది. అంతేకాదు, ఎన్టీఆర్, అలియా భట్ లకు పంపించే అవార్డు ట్రోఫీలను ప్యాక్ చేసిన వెల్వెట్ బాక్సు ఫొటోను కూడా క్రిటిక్స్ అసోసియేషన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.