హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్.. తారక్ కు కూడా అవార్డు ఇస్తామన్న హెచ్సీఏ
- హెచ్సీఏ అవార్డుల్లో రామ్ చరణ్ సందడి
- తారక్ ను హెచ్సీఏ పట్టించుకోలేదంటూ అభిమానుల ఆగ్రహం
- తారక్ ను ఆహ్వానించామని చెప్పిన హెచ్సీఏ
మరోవైపు హెచ్సీఏ అవార్డులపై తారక్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్సీఏ స్పందించింది. అవార్డుల కార్యక్రమానికి తాము జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఆహ్వానించామని... అయితే, ఆయన ఇండియాలో షూటింగ్ లో బిజీగా ఉన్నారని తెలిపింది. తమ నుంచి ఆయన త్వరలోనే అవార్డులను స్వీకరిస్తారని చెప్పింది. ఈ వివరణతో తారక్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.