ఆర్య సరసన పూజ హెగ్డే!
- ఆవారా సీక్వెల్ కు ప్లాన్ చేసిన లింగుస్వామి
- హీరోగా కార్తి స్థానంలో ఆర్య
- 2010లో వచ్చిన ఆవారా సూపర్ హిట్
సీక్వెల్ అంటే సహజంగా మొదటి భాగంలో చేసిన హీరో, హీరోయిన్లే ఉంటారు. కానీ, లింగుస్వామి ఈసారి కార్తి కాకుండా ఆర్యను హీరోగా ఎంచుకున్నాడు. అతని సరసన పూజ హెగ్డే నటించనుందని కోలీవుడ్ సమాచారం. లింగుస్వామి చెప్పిన కథ నచ్చడంతో పూజ కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా, పూజ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.