నేటి నుంచే వాల్తేరు వీరయ్య ఓటీటీలో స్ట్రీమింగ్..
- వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించిన మెగా మూవీ
- థియేటర్లో చూడడం కుదరని అభిమానులకు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్
- చాలాకాలం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించిన సినిమా
సంక్రాంతి బరిలో రెండు తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు రెండు థియేటర్లలో విడుదలయ్యాయి. అందులో ఓవరాల్ గా దాదాపు రూ.250 కోట్ల వసూళ్లతో వాల్తేరు వీరయ్య ముందంజలో నిలిచింది. ఓవర్సీస్‌లోనూ వాల్తేరు వీరయ్య సినిమా 2.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. సోమవారం (ఫిబ్రవరి 27) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోంది.