ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’లో కీలక మార్పు
- సంగీత దర్శకుడిని మార్చిన చిత్ర బృందం
- మిక్కీ జే మేయర్ స్థానంలో సంతోష్ నారాయణ్ రాక
- చివరి దశకు చేరుకున్న షూటింగ్?
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ పేరును చిత్రబృందం గతంలో ప్రకటించింది. కానీ, ఇప్పుడు మిక్కీ స్థానంలో సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, ఈ చిత్రం టైటిల్‌ను వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారు. అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.