టామ్ క్రూస్, బ్రాడ్ పిట్ లతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటీ.. అద్భుతమైన ఫీలింగ్ అన్న చరణ్!
- అంతర్జాతీయ వేదికలపై 'ఆర్ఆర్ఆర్' సందడి
- క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్ బరిలో నిలిచిన రాజమౌళి చిత్రం
- బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ పోటీలో చరణ్, తారక్
మరోవైపు సూపర్ అవార్డ్స్ కు నామినేట్ కావడంపై రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశాడు. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తన పేరు కూడా యాక్షన్ మూవీలో బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం నామినేట్ కావడం సంతోషాన్ని కలిస్తోందని చెప్పాడు. నికోలస్ కేజ్, టామ్ క్రూస్, బ్రాడ్ పిట్ వంటి లెజెండ్స్ పక్కన తమ పేర్లు ఉండటం ఒక అద్భుతమైన ఫీలింగ్ ను కలగజేస్తోందని అన్నాడు.